నా మనస్సులోని రచ్చబండ ...
ఎక్కడుంది మనశ్శాంతి, ఎక్కడుంది మనశ్శాంతి వేసే అడుగులలో దాగివుందా? లేక ఆ అడుగుల వెనక ఆలోచనలో ఉందా? ఎక్కడుంది మనశ్శాంతి, ఎక్కడుంది మనశ్శాంతి రాసే చేతిలో ఉందా? లేక దాన్ని నడిపే మెదడులో ఉందా? ఎక్కడుంది మనశ్శాంతి, ఎక్కడుంది మనశ్శాంతి నేర్పిన చదువులో ఉందా? లేక నేర్పించిన సంస్కారంలో ఉందా? ఎక్కడుంది మనశ్శాంతి, ఎక్కడుంది మనశ్శాంతి మనస్సులో శాంతి ఉందా? లేక శాంతిలోనే మనస్సు దాగి ఉందా? ఎక్కడుంది మనశ్శాంతి, ఎక్కడుంది మనశ్శాంతి