ఎవరు నువ్వు? ( Who are you?)
ఎవరు నువ్వు ? పిడుగులకి , ఉరుములకి జంకని నిర్మలమైన పుడమివ ? లేక , సముద్ర గర్భాన అనంతమైన ఒత్తిడికి గురైన రత్నానివ ? అనేక సంపదలు దాచుకున్న అడవివ ? లేక అరణ్యంలొ అగమ్యగోచరముగ మారిన కామ్రేడ్ వ ? విశాలమైన ఈ విశ్వాన్ని నోటిలొ దాచుకున్న శ్రీక్రిష్నుడివ ? లేక ఈ జిత్తులమారి అంతర్జాలపు వలలొ చిక్కిన చేప పిల్లవ ? జల జల పారే నదీ ప్రవాహానివ ? లేక నీ కాళ్ళను భూమిలోనే పాతిపెట్టుకున్న తిప్పవ ? గుడి ముందు కూర్చున్న పిచ్చివాడివ ? లేక దేవుడి ముందు నిల్చున్న పూజారివ ? సంబంధ - భాందవ్యాల కారాగారంలొ పడిన ఖైదీవ ? లేక జీవిత సత్యాన్ని వివరించలేని ఋషివ ? ఎవరు నువ్వు ? ...