Posts

Showing posts from February, 2020

ఎందుకో గాని నాన్న ఓడిపోయాడు....

అమ్మకి  ప్రసవించేటప్పుడే  నొప్పులు, కాని  నాన్న  ఇరవై  ఏళ్లగా  నొప్పులు  భరిస్తూనే  ఉన్నాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  చిన్నప్పుడు  గోరుముద్దలు  తినిపించేది, కాని  నాన్న  వ్రేళ్ళు  పట్టి  నడిపించాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  తప్పు  చేస్తె  తిట్టేది, కాని  నాన్న  తప్పు  చేస్తె  గట్టిగా  శిక్షించేవాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  పిల్లలు  కడుపు  నిండడానికి  తాను  పస్తులుండేది, కాని  నాన్న  తనను  తినమని  తన  మిత్రుడు  ఇచ్చిన  మిఠాయిని  జేబులో  దాచుకొని, ఇంటికి వచ్చి పిల్లలకిచ్చాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ, గుమ్మం ముందు నిలబడి పిల్లల్ని బడికి సాగనంపేది, కాని నాన్న మాత్రం కిటికిలోనుండి చూసి ఆనందించేవాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు......