ఎందుకో గాని నాన్న ఓడిపోయాడు....

అమ్మకి  ప్రసవించేటప్పుడే  నొప్పులు,
కాని  నాన్న  ఇరవై  ఏళ్లగా  నొప్పులు  భరిస్తూనే  ఉన్నాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ,  చిన్నప్పుడు  గోరుముద్దలు  తినిపించేది,
కాని  నాన్న  వ్రేళ్ళు  పట్టి  నడిపించాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ,  తప్పు  చేస్తె  తిట్టేది,
కాని  నాన్న  తప్పు  చేస్తె  గట్టిగా  శిక్షించేవాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ,  పిల్లలు  కడుపు  నిండడానికి  తాను  పస్తులుండేది,
కాని  నాన్న  తనను  తినమని  తన  మిత్రుడు  ఇచ్చిన  మిఠాయిని  జేబులో  దాచుకొని, ఇంటికి వచ్చి పిల్లలకిచ్చాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ, గుమ్మం ముందు నిలబడి పిల్లల్ని బడికి సాగనంపేది,
కాని నాన్న మాత్రం కిటికిలోనుండి చూసి ఆనందించేవాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ, పిల్లలు విదేశాలకు వెళ్తుంటే బోరున ఏడ్చేది,
కాని  నాన్న  గుండె  మాత్రం  భరువెక్కింది, గుటకలు మింగాడు, కాని కన్నీరు కార్చలేదు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అడవి తల్లి , భూతల్లి , భారతమాత, అన్నిటికి తల్లి పేర్లే,
కాని నాన్న తనకు గుర్తింపు రాకపోయిన, తాను తడుస్తూనే తన కుటుంబానికి గొడుగు పట్టి ముందుకు నడిపించాడు,
ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు....

అమ్మ ప్రేమ అర్థమైయేది,
కాని అనంతమైన ప్రేమ తనలో ఉన్నా, అది చూపించడంలో నాన్న ఎందుకో విఫలమైనాడు, 
అందుకె కావొచ్చు నాన్న ఓడిపోయాడు.  


                                                                                                                                                                                             - Prithvi Sangani

Comments

Popular posts from this blog

పుస్తకం

Ambedkar A Life by Shashi Tharoor

Some Unsolicited Advice to Myself