వలస కార్మికులు (The Migrant labours)
ఆ కాళ్ళకి చెప్పులు లేవు! ఆ నడకకి గమ్యం లేదు! ఆ చెమటకి ఫలితం లేదు! ఆ చీకట్లకి వెలుతురు లేదు! నువ్వు నాలుగు వందల కిలోమీటర్లు నడిస్తే ఎవరికి కావాలి? నువ్వు ఆకలితో అలమటిస్తే ఎవరు చూడాలి? నువ్వు తాకట్టు పెట్టిన శ్రమకి, చివరికి మిగిలిందేంటి? నిన్ను ఈ లోకంలో ఎవరు చేరదీయరు నిన్ను చివరికి చితి మంటలు కూడ ఇష్టపడలేదు అందుకే కావొచ్చు నీ గట్టం రైలు పట్టాలపైన ముగిసింది ఆ కాళ్ళకి చెప్పులు లేవు! ఆ నడకకి గమ్యం లేదు! ఓ వలస కార్మికుడా! కాస్త పదిలం ................ ...