స్వేత్చా.....

ఒక పదహారు యేండ్ల అమ్మాయి తన నాన్నతో ఇలా  సంభాషించింది......

అమ్మాయి: నాన్న , ఎన్నో రోజులు నుండి  ఒకటి అడుగుదాం అనుకున్నాను అడగొచ్చా?

నాన్న: చెప్పు తల్లీ, అడుగు ఏంటో?

అమ్మాయి: మీరు నాకు జూనియర్ కాలేజి వెళ్లాలంటే భయం వేస్తుంది అంటే, అక్కడ టీచర్స్ నాన్న వయస్సు ఉంటారు , నాన్న లాగ చూసుకుంటారు, నీకు నాన్న అంటే ఇష్టమే కదా ? నా లాగనే చూసుకుంటారు  , భయపడకు తల్లీ అని చెప్పారు కదా? 

నాన్న: ఔను తల్లీ.

అమ్మాయి: వాళ్ళ వయస్సు మీ అంత ఉండటం నిజమే. కానీ , వాళ్ళ చూపు మాత్రం ఇబ్బందికరంగా ఉంది నాన్న, అందులో నా ఫ్రెండ్ స్వేత్చా వాళ్ళ నాన్న కూడా ఉంటాడు , అయన చూపు కూడా ఇబ్బందిగా ఉంటుంది నాన్న.  భయం వేస్తుంది నాన్న కాలేజి వెళ్లాలంటే , అని ఏడ్చింది.
అమ్మ మాత్రం ఎప్పుడు భయటకు వెళ్లిన, అన్నయ వయస్సు ఉన్న వాళ్ళతో, తన కొడుకులా సంబాషించేది, కానీ మా సార్లు అట్లా ఎందుకు లేరు నాన్న?
స్వేత్చా అని తన బిడ్డకి పేరు పెట్టారు కానీ, ఒక అమ్మాయికి నిజమైన స్వేత్చా ఇవ్వగలిగాడా?
నాకు చదువుకోవాలని ఉంది నాన్న, కానీ కాలేజి వెళ్లాలంటే భయం వేస్తుంది.
 తప్పు ఎవరిది నాన్న? నువ్వు కూడా ఇలానే చేస్తావా ?

ఈ మాటలు విని  తన తండ్రి  కంట్లో నీళ్లు తిరిగాయి......

- Prithvi Sangani

Comments

Popular posts from this blog

పుస్తకం

Ambedkar A Life by Shashi Tharoor

Some Unsolicited Advice to Myself