Introversion

ఏదో శక్తి నా గొంతును నలిమేస్తుంది,

ఆ శక్తి చేత నా గళం అణచివేయబడింది,

నా గళం క్రుంగి పోయింది , ఆత్మ విశ్వాసం కోలిపోయింది,

మూగదైన నా గళం ఎన్నో రోజులు తపస్సు చేసింది,

బహుశా ఈ శక్తే నన్ను ఇంట్రోవెర్ట్ చేసిందేమో,

 

తపస్సు  ఫలించింది , గళానికి ' చేయి ' సాయం చేసింది,

గొంతుకలోనుండి రావాల్సిన గేయం, చేతిపైనుండి అక్షరంలా మలుపు తిరిగింది,

ఒక నదిలా ప్రవహించింది , చివరికి సంద్రముతో మమేకమైంది,

ఈ రాతలు ఎవరో తల రాతలు మార్చాలనే సదుద్దేశం ఈ చేతికి లేదు,

ఈ రాతలు నా తల రాతలు మారుస్తుంది అనే స్వార్థముంది.



- Prithvi Sangani

Comments

Post a Comment

Popular posts from this blog

పుస్తకం

Ambedkar A Life by Shashi Tharoor

Some Unsolicited Advice to Myself