వలస కార్మికులు (The Migrant labours)
ఆ కాళ్ళకి చెప్పులు లేవు!
ఆ నడకకి గమ్యం లేదు!
ఆ చెమటకి ఫలితం లేదు!
ఆ చీకట్లకి వెలుతురు లేదు!
నువ్వు నాలుగు వందల కిలోమీటర్లు నడిస్తే ఎవరికి కావాలి?
నువ్వు ఆకలితో అలమటిస్తే ఎవరు చూడాలి?
నువ్వు తాకట్టు పెట్టిన శ్రమకి, చివరికి మిగిలిందేంటి?
నిన్ను ఈ లోకంలో ఎవరు చేరదీయరు
నిన్ను చివరికి చితి మంటలు కూడ ఇష్టపడలేదు
అందుకే కావొచ్చు నీ గట్టం రైలు పట్టాలపైన ముగిసింది
ఆ కాళ్ళకి చెప్పులు లేవు!
ఆ నడకకి గమ్యం లేదు!
ఓ వలస కార్మికుడా! కాస్త పదిలం ................
- Prithvi Sangani
Nice bhaiyya
ReplyDeleteThanks ra Srinivas
ReplyDelete